Thursday, November 22, 2007

తన రాక కోసం


తన రాక కోసం

నచ్చిన నెచ్చెలి చెప్పే

తొలకరి చినుకుల్లాంటి ముద్దు మాటల్లో

ముద్దగా తడిసిపోవాలని

తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను

ఒంటరిగా కాదులెండి

తోడుగా ఆమె తలపులు

తను ఒకసారి వచ్చి

వేల వసంతాలను కానుకిచ్చివెళుతుంది

అనుభూతుల వానలో తడిపి

ఆరేలోపు వచ్చేస్తానంటుంది

నాకు మాత్రం

మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్ల తో

రేయి కల లా సాగిపోతుంది

నెచ్చెలి తెచ్చే నవ్వుల కోసం

ఎదురుచూపుల్లో మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది

Wednesday, November 21, 2007

నీ జ్ఞాపకం


నీ జ్ఞాపకం


ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలా
పోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలని
కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలని
చెరిగిపోయిన చిరునవ్వుని
నీ చెలిమితో మరలా చిత్రించాలని..
ఎన్ని ఆశలో తెలుసా...

నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...
ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుంది